: భారత పాస్ పోర్ట్ పై 2007లో అమెరికా వెళ్లిన భత్కల్
ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెల్లడిస్తున్నాడు. 2007లో భారత పాస్ పోర్టుపై అమెరికా వెళ్లినట్లు చెప్పాడు. అంతకుముందు 2006లో జరిగిన ముంబయి సీరియల్ ట్రైన్ పేలుళ్ల ఘటనకు పేలుడు పదార్ధాలను సరఫరా చేసినట్లు వెల్లడించాడు. ఈ పేలుళ్లలో 188 మంది మరణించారు. కాగా, భత్కల్ కు ఢిల్లీ కోర్టు 12 రోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.