: సచివాలయంలో ఉద్రిక్తత.. ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య తోపులాట


సచివాలయంలో జరుగుతున్న ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీమాంధ్ర, తెలంగాణకు చెందిన సచివాలయ ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ సచివాలయాన్ని హోరెత్తించారు. గత నెల రోజులుగా ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసనకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ర్యాలీ చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులు అడ్డువెళ్లడంతో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ఉద్యోగులు తోపులాటకు దిగారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుప్రాంత ఉద్యోగులను అడ్డుకుని సర్ది చెప్పారు. కాగా, తెలంగాణ ప్రాంత ఉద్యోగులే తమను రెచ్చగొడుతున్నారని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News