: అగస్టా కుంభకోణంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నివేదిక
అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నివేదికను నమోదు చేసింది. ఈ నివేదికలో మొత్తం నాలుగు సంస్థల పేర్లు, పదకొండు మంది వ్యక్తులను సీబీఐ పేర్కొంది. ఈ కేసులో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాయు సేన మాజీ చీఫ్ ఎస్ పీ త్యాగితో పాటు ఆయన ఇద్దరు బంధువుల పేర్లను సీబీఐ నివేదికలో జత చేసింది.