: బాబు యాత్ర చేయాలి, వాస్తవాలు ప్రజలకు వివరించాలి: మురళీ మోహన్
చంద్రబాబు నాయుడు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేయాలని సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ తెలిపారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, నాయకుడనే వాడు ఇంట్లో దాక్కోకూడదని ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వచ్చి.. అసలేం జరిగింది? పార్టీలు తీసుకునే స్వార్థ నిర్ణయాలకు ప్రజలు ఎలా బలౌతున్నారన్న విషయాలను తెలియజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడి యాత్ర వల్ల ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయని మురళీమోహన్ అభిలషించారు.