: సచివాలయంలో పోటాపోటీ నిరసనలు
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు విధులను బహిష్కరించి పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఉద్యోగుల నినాదాలతో సచివాలయం మార్మోగిపోతోంది. గత 31 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసన కొనసాగిస్తుండగా.. వీరికి పోటీగా తెలంగాణ ఉద్యోగులు కూడా నిరసనలకు దిగారు. దీంతో సచివాలయంలో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. తెలంగాణకు అనుకూలంగా వారు ఆందోళనలు చేస్తున్నప్పుడు తాము సంయమనం పాటించామని, తెలంగాణ ఉద్యోగులు మాత్రం ఘర్షణకే మొగ్గు చూపుతున్నారని, అందుకే పోటీ నిరసనలు, నినాదాలు చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగులు విమర్శిస్తున్నారు.