: ఆందోళనలతో కేంద్రం వెనక్కి వెళ్లి పోయిందనుకుంటే మూర్ఖత్వమే: డీఎస్
సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలతో తెలంగాణ అంశంపై కేంద్రం వెనక్కి మళ్ళిందనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందని పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలకు ప్రశాంత వాతావరణంలో తమ వాదన చెప్పుకునే హక్కు ఉందని అన్నారు. తెలంగాణపై నిర్ణయం జరిగాక అందరూ సహకరించాలి తప్ప విద్వేషాలు పెరిగేలా మాట్లాడకూడదని డీఎస్ సూచించారు. ఏపీఎన్జీవోల బహిరంగ సభకు అనుమతినిచ్చే విషయం ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.