: రేపటినుంచే చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర'
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న 'ఆత్మగౌరవ యాత్ర' రేపటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా బాబు విజయనగరం వెళతారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బస్సుయాత్రను ప్రారంభిస్తారు. యాత్రలో పలువురు పార్టీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారు. యాత్రకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.