: బెజవాడలో టీడీపీ నేతల ర్యాలీ, మానవహారం
విజయవాడలో టీడీపీ ఎంపీలు, నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి డీవీ మేనార్ సర్కిల్ వరకు 3 వేల మంది విద్యార్ధులతో దేవినేని చంద్రశేఖర్, గద్దే రామ్మోహన రావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను సభ నుంచి సస్పెండ్ చేసినా తమ ఆందోళన కొనసాగిస్తున్నామని, ప్రజాభీష్టమే తమ అభీష్టమని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు.