: విశాఖలో ఆటోల బంద్... స్థానికుల ఇక్కట్లు
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో రెండో రోజు కూడా ఆటోల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు లేక గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులను తాజాగా ఆటోల బంద్ మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. దీంతో స్థానికులతో పాటు సింహాచల క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు.