: పార్టీ నేతలతో నేడు బాబు కీలక భేటీ
ఆత్మగౌరవ యాత్రపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆయన చేపట్టే బస్సు యాత్రపై సీమాంధ్రలోనూ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు నిన్న మాట్లాడుతూ, బాబు యాత్ర ఎందుకోసమో స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో యాత్ర సందర్భంగా ఎలాంటి విషయాలు ప్రస్తావించాలి, హైదరాబాద్ విషయంలో ఎలాంటి బాణీ వినిపించాలి? అన్న విషయాలను బాబు పార్టీ నేతలతో చర్చిస్తారు. ఈ భేటీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది.