: ఎమ్మెల్యే సోదరుడి హత్య కేసులో మరికొంతమంది లొంగుబాటు


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోదరుడు జగన్ మోహన్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులు జిల్లాలోని దేవరకద్ర పోలీస్ స్టేషన్ లో ఈరోజు లొంగిపోయారు. సూర్యమోహన్ రెడ్డి, వెంకట్రాములు, ప్రవీణ్ కుమార్ లు లొంగిపోయినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. జగన్ మోహన్ హత్య కేసుకు సంబంధించి గతంలో ఐదుగురు నిందితులు లొంగిపోయారు. వారిలో ప్రధాన నిందితుడు ఎర్ర శేఖర్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News