: తొమ్మిదేళ్లుగా ఇచ్చింది చెత్త బియ్యమా?: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వస్తున్నా- మీకోసం' పాదయాత్రలో భాగంగా ఆయన విజయవాడ సింగ్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం గురించి మాట్లాడుతుంటే, తొమ్మిదేళ్లుగా తామిచ్చింది చెడ్డ బియ్యమని ఒప్పుకున్నట్లయిందని బాబు ఎద్దేవా చేశారు. విజయవాడకు రింగు రోడ్డు నిర్మించేందుకు పేదల భూములను పణంగా పెట్టాలనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి అని చంద్రబాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News