: లగడపాటికి మళ్ళీ చేదు అనుభవం
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు మరో చేదు అనుభవం ఎదురైంది. రెండ్రోజుల క్రితం ఆయనను విజయవాడలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకోగా, నేడు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్ధి జేఏసీ, సమైక్యవాదులు అడ్డుకున్నారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు, ఎంపీ రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.