: 'సమైక్య గర్జన' నేపథ్యంలో కడపలో ఉద్రిక్తత
సమైక్యాంధ్రకు మద్ధతుగా కడప నగరంలో చేపట్టిన 'సమైక్య గర్జన' ఉద్రిక్తంగా మారింది. రెండు లక్షల మందితో చేపట్టిన ఈ భారీ నిరసనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఆగ్రహించిన సమైక్యవాదులు గర్జనను బహిష్కరించి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే, కలెక్టర్ బంగ్లా వద్దే సమైక్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, పోలీసులు, సమైక్యవాదుల మధ్య ఘర్షణ నెలకొని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు కడప నడిబొడ్డున ఉన్న కోటిరెడ్డి కూడలికి పోలీసులు నాలుగు వైపులా ముళ్ల కంచెవేసి దిగ్బంధం చేశారు. దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు సమైక్య గర్జన సభ నిర్వహించేందుకు అనుమతించకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నారు.