: జైలు శిక్షతో పాటు ఆడతనం వచ్చేసింది
పురుషులు తాము కోరి కోరి స్త్రీత్వాన్ని తెచ్చుకోవడం కొత్త విషయం కాదు. కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. లింగమార్పిడి చేసుకుని అతివలుగా మారే.. హీరోలు మనకు చాలా మంది తారసపడుతుంటారు. అలా స్త్రీగా మారడం ద్వారా.. తమ జీవితాన్ని మరో రీతిగా వారు ఆనందించాలని అనుకుని, ఆ వాంఛతోనే ఆ లింగమార్పిడికి సిద్ధం కావడం పరిపాటి. కానీ.. అనుభవించడానికి ఇక జీవితం తన చేతుల్లో ఏమీ లేకుండా, కేవలం జైలు గోడలకే పరిమితం అయిపోయినప్పుడు.. ఇక ఆడతనం అయితే ఏంటి.. మగతనం అయితే ఏంటి?
కానీ ఆ సైనికుడు మాత్రం.. జైల్లో గడచిపోయే జీవితాన్ని ఆడతనంతోనే అనుభవించాలనుకున్నాడు. విషయం ఏంటంటే.. బ్రాడ్లే ఎడ్వర్డ్ మానింగ్ అనే అమెరికా సైనికుడు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో నిందితుడు. ఇతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. కన్సాస్‌లోని సైనిక జైలులో శిక్ష అనుభవించడం మొదలైంది. అయితే అతను తన ఇష్టపూర్వకంగా లింగమార్పిడి చేయించుకున్నాడు. ఎలిజబెత్ మానింగ్ గా కొత్త పేరు పెట్టుకున్నాడు. 35 ఏళ్ల జైలు ముగిసేలోగా.. జీవితం మొత్త పరిసమాప్తం కావొచ్చు గానీ.. ఇక మీదట బ్రాడ్లే అదే ఎలిజబెత్ అమ్మాయిల జైలులో గడపనుంది. అయితే ఎలిజబెత్‌కు ముందు అమ్మాయిగా బతకడంపై నాలుగువారాల కౌన్సెలింగ్ కూడా ఇస్తారట. కొత్త కదా మరి!!