: 24 గంటలపాటు కూంబింగ్..57 మంది తీవ్రవాదుల హతం
ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు, సైనికులు, నాటో సంకీర్ణ దళాలు సంయుక్తంగా చేపట్టిన తీవ్రవాదుల ఏరివేత దాదాపు విజయవంతమైంది. దాదాపు 24 గంటలపాటు నిర్వహించిన కూంబింగ్ లో 57 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మరో పదిమంది గాయపడగా, నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. బగ్లాన్, కుందజ్ నంగర్హర్, కపిస, సారిపుల్, జవజాన్, కాందహార్, హెల్మండ్ ప్రావిన్స్ లలో తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని వివరించారు. సంకీర్ణ దళాల దాడుల్లో భారీగా ఆయుధాలు, మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో చెప్పారు. కాగా, ఈ ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాషై ఆర్చి జిల్లా ఉన్నతాధికారి షేక్ సుద్రుద్దీన్ మరణించినట్లు పేర్కొన్నారు.