: విజయవంతమైన పీఎస్ఎల్వీ సీ-20 రాకెట్ ప్రయోగం
గగనతలంపై భారత కీర్తి మరోసారి రెపరెపలాడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా ఏడు ఉపగ్రహలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానమైనది 409 కేజీల బరువైన మన దేశానికి చెందిన సరళ్ ఉపగ్రహం. సరళ్ తో పాటు విదేశాలకు మరో ఆరు నానో ఉపగ్రహలను పీఎస్ఎల్వీ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. భారత కీర్తిని నలు దిశలా వ్యాపింపజేశారని ఆయన ప్రశంసించారు.