: బీసీసీఐ, శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ కు సుప్రీం నోటీసులు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ, శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ స్కాంపై దర్యాప్తు జరిపేందుకు బీసీసీఐ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అసలు ఐపీఎల్ లో ఫిక్సింగే జరగలేదని ఆ కమిటీ పేర్కొంది. అయితే, ఓ పిటిషన్ పై విచారణ జరిగిన బాంబే హైకోర్టు కమిటీ నియామకం చెల్లదంటూ పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం తాజా నోటీసులు ఇచ్చింది. మరోవైపు బీసీసీఐ వర్కింగ్ కమిటీ సెప్టెంబర్ 1న కోల్ కతాలో సమావేశంకానుంది. కాగా, శ్రీనివాసన్ తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అధ్యక్ష విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో జగ్మోహన్ దాల్మియా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.