: డప్పుకొట్టిన డాలర్ శేషాద్రి
డాలర్ శేషాద్రి.. టీటీడీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) గా వ్యవహరించే ఈ పెద్దాయన శ్రీవారికి నిర్వహించే అన్ని సేవల్లోనూ పాల్గొంటారు. తిరుమల వచ్చే వీఐపీలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, వారికి దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించడం డాలర్ శేషాద్రిగారికి ఇష్టమైన పని. అలాంటి ఈ పెద్దమనిషి సమైక్యాంధ్ర కోసం వీధిబాట పట్టాడు. ఉద్యమంలో కలిశాడు. గొంతుకలిపి, పదం పాడి రాష్ట్ర విభజనపై నిరసన వ్యక్తం చేశాడు. అంతేగాకుండా, నేడు తిరుమలలో టీటీడీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించగా, డప్పు వాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా, ఉద్యమకారులు తిరుపతి అష్టదిగ్బంధనాన్ని నేడూ కొనసాగించడంతో కొండపైకి భక్తులు కొద్దిసంఖ్యలోనే చేరుకున్నారు. దీంతో, తిరుమల వీధులు బోసిపోయినట్టు కనిపించాయి.