: యూపీ ఐఏఎస్ అధికారిణిపై మరో విచారణ
ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్ పాల్ పై తాజాగా మరో విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఛార్జిషీటుపై ఆమె ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం పట్ల ముఖ్యమంత్రి అఖిలేష్ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే మళ్లీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎం శ్రీవాస్తవని విచారణాధికారిగా నియమించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశించింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, రాజకీయవర్గాల ఆగ్రహానికి గురైన దుర్గాశక్తి ఆనక సస్పెండైన సంగతి తెలిసిందే.