: కాసేపట్లో జగన్ దీక్ష విరమించే అవకాశం?
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తన దీక్షను మరికాసేపట్లో విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాజకీయ కమిటీ హైదరాబాదులో అత్యవసర సమావేశం నిర్వహించింది. జగన్ దీక్ష విరమిస్తేనే బావుంటుందని కమిటీ అభిప్రాయపడింది. ఈమేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగన్ కు లేఖ రాయనున్నట్టు సమాచారం. జగన్ దీక్షకు నేడు ఆరోరోజు కాగా, గతరాత్రి చంచల్ గూడ జైలు నుంచి జగన్ ను ఉస్మానియాకు తరలించిన సంగతి తెలిసిందే.