: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులోనే భత్కల్ అరెస్ట్
హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ బస్టాప్ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్ల కేసులోనే ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. తబ్రేజ్ అలియాస్ అసదుల్లా అక్తర్ తో భత్కల్ హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర చేశాడని ఎన్ ఐఏ పేర్కొంది. పేలుళ్లకు భత్కల్ రెక్కీ నిర్వహించాడని ఎన్ఐఏ వెల్లడించింది.