: అజయ్ చౌతాలాపై దర్యాప్తుకు ఆదేశించిన తీహార్ జైలు అధికారులు


ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా కుమారుడు అజయ్ చౌతాలాపై దర్యాప్తుకు తీహార్ జైలు అధికారులు ఆదేశించారు. ఓ కేసులో దోషులుగా నిర్ధారణ అవ్వడంతో ఢిల్లీ కోర్టు అజయ్ చౌతాలా, తండ్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలాకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో జైలు నుంచి అజయ్ చౌతాలా ఫోన్ ద్వారా హర్యానాలో జరుగుతున్న ఓ పబ్లిక్ ర్యాలీలో ప్రసంగించారని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 19-20 మధ్య తన కుమారుడితో ఫోన్ లో మాట్లాడిన చౌతాలా అనంతరం పార్టీ నేతలతో సంభాషించారని జైలు డీజీపీ విమ్లా మెహ్రా తెలిపారు. దీనిపై అధికారులు శనివారం దర్యాప్తుకు ఆదేశించారు.

అందులో ప్రతి కోణాన్ని పరిశీలించామని, నివేదికను సోమవారం లేదా మంగళవారం జైలు అధికారులకు అందజేస్తామని చెప్పారు. మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణలు నిజమే అయితే చౌతాలాపై సరైన చర్యలు తీసుకుంటామని మెహ్రా పేర్కొన్నారు. ఇదే విషయమై మరో జైలు అధికారి మాట్లాడుతూ.. ఈ నెల 20న అజయ్ చౌతాలా తన కుమారుడు దుష్యంత్ ఫోన్ ద్వారా 5 నిమిషాల పాటు సోనిపేట జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారని వివరించారు. 

  • Loading...

More Telugu News