: మాట నిలబెట్టుకున్న ప్రధాని


ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ని్న్న పార్లమెంటులో రూపాయి పతనంపై విపక్షాలు ఆందోళన చేయగా.. శుక్రవారం నాడు తప్పకుండా సభలో వివరణ ఇస్తానని ప్రధాని చెప్పారు. నేడు లోక్ సభ వాయిదా పడి పునఃప్రారంభం కాగా ప్రధాని దేశ ఆర్ధికస్థితిపై వివరణ ఇచ్చారు. మే 22 నుంచి రూపాయి పతనం ఆరంభమైందని తెలిపారు. సిరియా అంతర్యుద్ధం సహా అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయని అన్నారు. దేశీయంగా కరెంటు ఖాతా లోటు కూడా రూపాయి బలహీనపడడానికి కారణమైందని అన్నారు.

దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల భారం పెరిగిందని, దీంతో, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చయిపోయాయని, తద్వారా రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకిందని చెప్పారు. ఇక దేశ ప్రజలకు బంగారం కొనుగోళ్ళను తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పొదుపు పాటించాలని సలహా ఇచ్చారు. కుదేలైన ఆర్ధికస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని ప్రధాని తెలిపారు.

కరెంటు ఖాతా లోటు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాజా ఆర్ధిక సంవత్సరంలో కరెంటు ఖాతా ద్రవ్య లోటును 70 బిలియన్ డాలర్లకు తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణల అమలులో రెండో అభిప్రాయానికి తావులేదన్నారు.

  • Loading...

More Telugu News