: హైదరాబాదుపై ప్రతిపాదనలు అర్ధరహితం: పరకాల
ఏపీ విభజనకు అంగీకరిస్తూ హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేయమనడం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ పలువురు చేస్తున్న ప్రతిపాదనలను విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ కొట్టిపారేశారు. ఇటువంటి ప్రతిపాదనలు అర్ధరహితమన్నారు. సమైక్యవాదాన్ని వినిపించని ఎంపీలు, మంత్రులు ప్రజాప్రతినిధులే కాదన్నారు. సమైక్య రాష్ట్రం కోరుతూ పంచాయతీలన్నీ ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని విశాఖలో జరిగిన కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ పిలుపునిచ్చింది.