: టీడీపీలో విభేదాలు?


తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర విభజన ప్రకటన చిచ్చు రేపినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న హరికృష్ణ సమైక్యాంధ్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని లేఖ రూపంలో వెలువర్చగా.. తాజాగా పయ్యావుల కేశవ్ ఏకంగా అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టేందుకు ఇది సమయం కాదని కేశవ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీమాంధ్రలో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే, యాత్ర సమంజసం కాదన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. బాబు యాత్ర సాగితే వైఎస్సార్సీపీ అడ్డుకునేందుకు యత్నిస్తుందని, అప్పుడు కాంగ్రెస్ లాఠీచార్జి చేయించి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటుందని వివరించారు. అంతేగాకుండా, సీమాంధ్రలో టీడీపీ వివరణ ఇచ్చుకోవాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయం బాబుకు చెప్పామని ఆయన తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరామని పయ్యావుల వెల్లడించారు.

  • Loading...

More Telugu News