: 'రాష్ట విభజన స్వార్ధ పూరిత నిర్ణయం' అంటూ పత్రాలు విడుదల
రాష్ట్ర విభజన ప్రకటనపై పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ప్రతిరోజూ విభిన్నంగా తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. ఐదు రోజుల సస్పెన్షన్ అనంతరం ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరయ్యారు. సభ వాయిదాపడ్డాక 'రాష్ట విభజన స్వార్ధ పూరిత నిర్ణయం' పేరుతో 3 పేజీల పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆ ప్రతులను పార్లమెంటు సభ్యులకు అందజేశారు.