: తెలంగాణ వాళ్ళు ప్రజలు కారా?: ఉప ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన తెలంగాణవాదాన్ని మరోసారి ఉద్ఘాటించారు. ప్రజల మనోభావాలు గుర్తెరగకుండా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలకు ప్రజలు సెలవు ప్రకటిస్తారని ముఖ్యమంత్రి కిరణ్ వ్యాఖ్యానించడంపై డిప్యూటీ సీఎం కౌంటర్ విసిరారు. ఒక ప్రాంతంలోని ప్రజలే ప్రజలా? అని అంటూ.. తెలంగాణ వారు ప్రజలు కారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తుందని వాగ్దానం చేసింది కాబట్టే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. నల్గొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం దామోదర పైవిధంగా మాట్లాడారు.