: జీశాట్-7 ప్రయోగం విజయవంతం
భారత తొలి రక్షణ ఉపగ్రహం 'జీశాట్ -7' ప్రయోగం విజయవంతం అయింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉదయం ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళిన ఏరియన్-5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రక్షణ అప్లికేషన్లతో కూడిన ఈ ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందించడానికి భారత రక్షణ శాఖ రూ.185 కోట్లు ఖర్చు చేసింది. దేశ సముద్ర భద్రతను మరింత పెంచేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని రక్షణ శాఖ తెలిపింది.