: విశాఖలో మూతపడిన వాణిజ్య సంస్థలు.. నేడు, రేపు ఆటోల బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపుతో విశాఖపట్నంలో వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. అటు ఆటోల యూనియన్ కూడా నేడు, రేపు బంద్ కు పిలుపునిచ్చింది. దాంతో, 10వేల ఆటోలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో జనజీవనం స్తంభించింది. సమైక్యాంద్రకు మద్దతుగా పలువురు తమ నిరసన తెలియజేస్తున్నారు.