: పొగమానేస్తే బరువు పెరుగుతామా?


పొగతాగడం మానేస్తే బరువు పెరుగుతామా... అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే పొగతాగేవారికి వారి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా పలు మార్పులను సంతరించుకున్న మూలంగా పొగతాగడం మానేయగానే సదరు బ్యాక్టీరియా మూలంగా బరువు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నట్టు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

జ్యూరిచ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పొగతాగడం మానేసిన తర్వాత వారి పేగుల్లోని బ్యాక్టీరియా పలు రకాల మార్పులకు లోనవుతున్నట్టు, ఇది ఊబకాయుల్లో కనిపించే బ్యాక్టీరియాను పోలి ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే పొగ తాగడం మానేసిన తర్వాత బరువు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు వారు తినే ఆహారం కన్నా కూడా వారి పేగుల్లోని బ్యాక్టీరియానే కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

పొగ మానేసిన వారిలోను, ఊబకాయుల్లోను ప్రోటీయోబ్యాక్టీరియా, బ్యాక్టెరాయిడెటీస్‌ రకాల సూక్ష్మ క్రిములు పెద్ద మొత్తంలో ఉంటున్నాయని ప్రొఫెసర్‌ గెర్‌హార్డ్‌ రోగ్లర్‌ తెలిపారు. ఇవి మరింత సమర్ధవంతంగా తమ శక్తిని వినియోగించుకుంటాయట. జీర్ణం కాలేని పీచును కూడా ఇవి అరాయించేసుకుంటాయట. దీంతో తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్ధంగా విసర్జితం కాకుండా కొంతమేర కొవ్వురూపంలోకి మారిపోతుంది. దీంతో సహజంగానే బరువు పెరగడం కూడా జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News