: తూర్పు గోదావరి జిల్లాలో పీఎస్ ను ముట్టడించిన గ్రామస్తులు


తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, తాళ్లరేవు మండలంలోని పి.మల్లవరంలోని పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో... పోలీసులే లాకప్ డెత్ చేశారంటూ మృతుని బంధువులతో పాటు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కృష్ణ అనారోగ్యంతోనే మరణించాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News