: కాదు కాదంటూనే..


కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ నుంచి పోటీచేసే ఆలోచన లేదని ఓపక్క చెబుతూనే, మరోపక్క పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ పార్టీ అనుమతిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు. మధ్యప్రదేశ్ లోని జబువా పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న డిగ్గీ రాజా మీడియాతో మాట్లాడారు. పనిలో పనిగా బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో మధ్యప్రదేశ్ విషయంలో ఇచ్చిన హామీలను బీజేపీ పూర్తి చేయటంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి గురించి ఆ పార్టీ మాట్లాడటం విచారకరమన్నారు.

  • Loading...

More Telugu News