: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: వెంకయ్య
దేశం ప్రస్తుతానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న ప్రస్తుత సమస్యలకు పరిష్కారం అంత సులువు కాదని అన్నారు. ప్రపంచదేశాలు మనల్ని నమ్మడం లేదని రతన్ టాటా చెప్పడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు కరవయ్యాయని ఆయన గుర్తు చేశారు. రూపాయి పతనం, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం తదితర అంశాలను రాష్ట్రపతికి వివరించేందుకు బీజేపీ బృందం వెళ్లనుందని ఆయన తెలిపారు. విశాలభావాలతో పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం సంకుచితంగా మారిందని, దాని ఫలితమే దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన మండిపడ్డారు.