: కర్నూలులో తులసీరెడ్డికి చేదు అనుభవం
20 సూత్రాల అమలు పథకం చైర్మన్ ఎన్ తులసీరెడ్డికి కర్నూలు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. సమైక్యాంధ్రకు మద్ధతుగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డికి మద్ధతు తెలిపేందుకు వెళ్లిన ఆయన్ను న్యాయవాదుల జేఏసీ అడ్డుకుంది. దాంతో, తులసీరెడ్డీ వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, న్యాయవాదులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో ఇరువర్గాలు పరస్పరం దూషించుకున్నారు. ఈ సమయంలో తులసీరెడ్డి చొక్కా చినిగింది.