: ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్రం సుముఖత!
దేశంలోని ఆరు విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 'ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'(ఏఏఐ)ఆధునికీకరించిన కోల్ కతా, చెన్నై, జోధ్ పూర్, అహ్మదాబాద్, లక్నో, గౌహతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదన తీసుకొచ్చింది. ముప్పైఏళ్ల పాటు ఈ ప్రైవేటీకరణ అమలులో ఉంటుంది. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబయి, హైదరాబాదు విమానాశ్రయాల్లో ఏఏఐకి 26 శాతం భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వందశాతం ప్రైవేటు వారికే అప్పజెప్పే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.