: కిడ్నాప్ వ్యవహారంతో కలకలం సృష్టించిన పీటీవో మాజీ ఉద్యోగి శర్మ అరెస్టు


హైదరాబాదులో కలకలం సృష్టించిన పీటీవో మాజీ ఉద్యోగి శర్మ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. నలుగురిని కిడ్నాప్ చేశానంటూ నిన్న తన ఫోన్ నుంచి మెసేజ్ లు పంపిన కానిస్టేబుల్ శర్మ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 18 గంటల్లో శర్మను పట్టుకున్నారు. ఇలా చేయడానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. అతని వద్ద ఒక్కరే ఉన్నారని పోలీసులు చెప్పారు. పబ్లిసిటీ కోసమే మెసేజ్ లు పంపానని అరెస్టు అనంతరం శర్మ చెప్పినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News