: మావాణ్ణి చంపలేదు, అదే చాలు: భత్కల్ కుటుంబీకులు


గతరాత్రి ఇండో-నేపాల్ బోర్డర్లో అరెస్టయిన కరడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్టుపై అతడి కుటుంబ సభ్యులు స్పందించారు. కర్ణాటకలోని భత్కల్లో యాసిన్ తండ్రి యాకూబ్ సిద్ది నేడు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. యాసిన్ ను బూటకపు ఎన్ కౌంటర్లో చంపేస్తారన్న భయం తొలగిపోయిందని ప్రకటనలో పేర్కొన్నాడు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, యాసిన్ పై అభియోగాలు రుజువైతే అతనికి శిక్ష వేయొచ్చని చెప్పారు. అయితే, నేరం నిరూపితమయ్యేవరకూ అందరూ నిర్దోషులే అని తెలిపారు. 2005లో యాసిన్ దుబాయ్ వెళ్ళాడని, 2007 నుంచి అతనితో సంబంధాలు తెగిపోయాయని ఆయన వెల్లడించారు. పుణేలోని జర్మన్ బేకరీ వద్ద పేలుళ్ళ ఘటనలో 17 మంది మరణించగా.. యాసినే నిందితుడు. అయితే, తమకు తెలిసినంత వరకు యాసిన్ పుణేలో ఎన్నడూ కాలుపెట్టలేదని యాకూబ్ అంటున్నారు.

  • Loading...

More Telugu News