: శోభా హైమావతి దీక్ష భగ్నం


విజయనగరం జిల్లా శృంగవరపుకోట లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తుండడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో మహిళా పోలీసులతో భారీ భద్రత నడుమ ఆమెను సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవంటూ కార్యకర్తలు మరోసారి ఆమెను దీక్ష స్థలికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆమెను వైద్యుల సాయంతో మరో గదికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వారికి పోలీసులు సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News