: కలిసి ఉండడం కోసం ఎక్కడా ఉద్యమం జరగలేదు: కోదండరాం
ఒక్కటిగా ఉండడం కోసం ఉద్యమం ఎక్కడా జరగలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాదులో ఈ మధ్యాహ్నం జరిగిన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సద్భావన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం తెలంగాణపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. సమస్యను పరిష్కరించాల్సిన సీమాంధ్ర నేతలు లేఖలు రాయడం సరికాదని వ్యాఖ్యానించారు. తమ హక్కులను అడ్డుకుంటే సహించబోమంటూ, సెప్టెంబర్ 7న హైదరాబాదులో శాంతి ర్యాలీ చేస్తామని తెలిపారు.