: చెన్నై తాగుబోతు ఘనకార్యం


తాగిన మైకంలో ఈ చెన్నై వాసి ఏం చేశాడో చూడండి. తనను చూసి మొరిగిందని ఓ కుక్కను కరిచి చంపాడు. చెన్నైలోని రాజా అన్నామలై పురంలో కుమార్ అనే వ్యక్తి బాగా తాగి పడుతూలేస్తూ వస్తున్నాడు. ఇంతలో ఓ కుక్క కుమార్ ను చూసి బిగ్గరగా మొరిగింది. దీంతో, మనోడికి కోపం నషాళానికంటింది. వెంటనే కుక్కను దొరకబుచ్చుకుని మీదపడి ఇష్టం వచ్చినట్టు కరిచిపారేశాడు. దాని చెవి పూర్తిగా కొరికి, అంతటితో ఆగకుండా, జేబులోంచి కత్తి తీసి మరో చెవిని కూడా కోసి చెత్తకుండీలో పారేశాడు. అక్కడితో తన పని పూర్తయిందన్నట్టు తూలుకుంటూ వెళ్ళిపోయాడు పాపం, ఆ శునకం రక్తమోడుతుండడం చూసి మనసు చలించిపోయిన ఓ ఆటో డ్రైవర్ దాన్ని ఆసుపత్రిలో చేర్చాడు. కానీ, ఫలితం లేకపోయింది. కుక్క చచ్చిపోయింది, ఇప్పుడు, పోలీసులు కుమార్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News