: కన్నా ఇంటికి సమైక్యసెగ
మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సమైక్యసెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజలు గుంటూరు జిల్లాలో ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి కన్నా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.