: పట్టాలెక్కిన డబుల్ డెక్కర్ రైలు!


సాధారణ బస్సుల్లో ప్రయాణం రొటీన్..అందుకే అప్పుడప్పుడు డబుల్ డెక్కర్ బస్సు కన్పిస్తే చాలు ఎక్కేందుకు చిన్నా, పెద్దా క్యూ కడతారు. అలాంటిది డబుల్ డెక్కర్ రైలే వస్తే ఇంకేముంది. అందరిలో కుతూహలం పెరిగిపోతుంది కదూ?

ఇంతకూ విషయమేంటంటే.. బెంగళూరు-చెన్నై ల మధ్యలో త్వరలో నడపబోతున్న డబుల్ డెక్కర్ రైలు బెంగళూరు చేరింది. పంజాబ్ కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ డబుల్ డెక్కర్ రైలు..పనితీరుని, సామర్థ్యాన్ని బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషనులో అధికారులు పరిశీలిస్తున్నారు. సాధారణ రైళ్ల పక్కనే కనబడుతున్న ఈ డబుల్ డెక్కర్ రైలును చూసేందుకు ప్రయాణీకులు ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News