: రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలి: కేసీఆర్
రెండు లక్షల మందితో భారీ బహిరంగ నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. సెప్టెంబర్ 6న ఈ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే సభ నిర్వహణపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, సభ ఎక్కడ జరుగుతుందనేది తెలియరాలేదు.