: అత్యాచారాలపై దేశ యువత ఎంతో ఆగ్రహంగా ఉంది: కరీనా


ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారాన్ని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తీవ్రంగా ఖండించారు. సాధారణంగా ఎక్కడో మారుమూల ప్రాంతాలలో జరిగే నేరాలు ముంబైలోనూ జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, అయితే, అక్షరజ్ఞానం లేకపోవడం వల్ల అన్నీ వెలుగులోకి రావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై యువతలో ఎంతో ఆగ్రహం నెలకొని ఉందని చెప్పారు. పరిస్థితులను మరోసారి సమీక్షించుకుని కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని సూచించారు.

  • Loading...

More Telugu News