: లోక్ సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం


లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే.. రూపాయి దారుణంగా పతనమవుతోంది, ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రారంభించకుండా ఏం చేస్తోందంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితి మార్పులేక పోవడంతో మధ్యాహ్నం 12.30 కి రెండోసారి వాయిదా పడింది. రెండో వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగా.. రేపు ప్రధాని ప్రకటన చేయడం కాదు, తక్షణం రూపాయి పతనం పై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News