: ఆశారాం విషయంలో పార్టీ నేతల వైఖరిపై మోడీ అసంతృప్తి


లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపును బీజేపీ నేతలు వెనకేసుకురావడంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాటుడే కథనం ప్రకారం.. బీజేపీ నేతలు ఎవరూ ఆశారాంకు మద్దతుగా వ్యవహరించకుండా ఆదేశించాలని మోడీ, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. ఆ ఆరోపణలను ఆశారాం చట్టప్రకారం ఎదుర్కోవాలన్నదే పార్టీ విధానంగా ఉండాలని సూచించారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ జా, ఉమా భారతి ఆశారాంకు మద్దతుగా బహిరంగ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆశారాంపై లైంగిక దాడి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కుట్రగా వారు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయన్న ఉద్దేశంతో మోడీ నేతలను కట్టడి చేయాలని రాజ్ నాథ్ కు సూచించారు.

  • Loading...

More Telugu News