: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: ప్రధాని
దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో పయనిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితితో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ప్రధాని రాజ్యసభలో అన్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను రేపు రాజ్యసభలో చేస్తామని ఆయన తెలిపారు. ఈ మందగమనానికి మన దేశంలో నెలకొన్న పరిస్థితులు కూడా కొంతవరకు కారణమని మన్మోహన్ సింగ్ చెప్పారు. మరోవైపు, డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంపై లోక్ సభ దద్దరిల్లింది. రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడటంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.