: ఖైదీని హతమార్చేందుకు యానాం సబ్ జైలుపై దాడికి యత్నం


యానాం సబ్ జైలులోని ఓ ఖైదీని హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఈ ఉదయం నాలుగు గంటల సమయంలో జైలులో ప్రవేశించేందుకు కొందరు దుండగులు యత్నించారు. జైలు వెనుక గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి సిబ్బంది చూడటంతో పారిపోయేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిలో ఏడుగురిని జైలు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే వారిని యానాం పోలీసు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. గత ఏడాది అరెస్టయిన పుదుచ్చేరీకి చెందిన మణికంఠ అనే ఖైదీని హతమార్చేందుకే సినీ ఫక్కీలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News