: ధ్యాన్ చంద్ కు 'భారత రత్న' ఇవ్వాలి: ముఖేష్


హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు 'భారత రత్న' ఇవ్వాలని వెటరన్ హాకీ ఆటగాడు ముఖేష్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహిస్తున్న హాకీ పోటీల ప్రారంభోత్సవంలో ముఖేష్ పాల్గొన్నారు. కాగా, ఈ పోటీలను క్రీడలశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా మైదానాన్ని నెలకొల్పనున్నట్టు అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News